స్వచ్ఛ విజయవాడ

కేశినేని నాని గారి అధ్వర్యంలో, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో టాటా ట్రస్ట్ ప్రారంభించిన అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో బహిరంగ మలవిసర్జన (ఓపెన్ ఎయిర్ డేఫెకేషన్ – ఓ.డి.ఎఫ్) నిర్మూలన ఒక ప్రధానమైనది. ఈ కార్యక్రమం నియోజకవర్గ పరిధిలో ప్రజలకి ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడే విధంగా దోహదం చేసింది.

ప్రణాళిక: బహిరంగ మలవిసర్జన వల్ల గ్రామాల్లో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. టాటా ట్రస్ట్ ద్వారా సూక్ష్మస్థాయిలో తయారు చేయబడ్డ, నియోజకవర్గంలోని 265 గ్రామాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా “స్వచ్ఛ కృష్ణ మిషన్”కు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమాన్ని అమలుచేసి గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం. మూడు స్వచ్చంద సేవా సంస్థలైన – సిపిఎఫ్ (సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ), ఎం.ఎ.ఆర్.ఐ. (మోడ్రన్ ఆర్కిటెక్ట్స్ ఫర్ రూరల్ ఇండియా) మరియు ఎ.జి.ఎస్. (అకాడమీ ఫర్ గాంధియన్ స్టడీస్)ల భాగస్వామ్యంలో జిల్లా పరిధిలో ఈ కార్యక్రమం అమలయ్యేలా కృషి చేస్తున్నారు.

kesineni_nani
kesineni_nani
kesineni_nani
పూర్తి వివరాల కోసం...

కేశినేని

కేశినేని నాని గారు యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక విభిన్న శైలిని కలిగిన ప్రజానాయకుడు. తన నియోజకవర్గ పరిధిలో ప్రజల జీవనశైలిలో గుణాత్మకమైన మార్పు తెచ్చేవిధంగా, సమగ్రమైన ప్రగతి ఫలాలు వారికి అందేవిధంగా నిరంతరం ఆలోచించే కార్యశీలి. తన ప్రాంత అభివృద్ధి కోసం, తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మెరుగైన ఉపాది అవకాశాలు అందేలా ప్రణాళికలను రూపొందించడానికి నిరంతరం ఆసక్తి కనబరిచే నాయకుడు. నిజమైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కేశినేని నాని గారు, “టాటాట్రస్ట్” యొక్క సౌజన్యంతో తన నియోజకం సమగ్రమైన ప్రగతి ఫలాలను పొందేలా కృషిచేస్తూ ఒక చరిత్రని సృష్టించారు. వారి సహకారంతో ఎన్నో విభిన్న పథకాలు, ఇదివరకెన్నడు చూడని విధంగా, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రజల అభివృద్దికోసం శ్రీకారం చుట్టారు. తన స్ఫూర్తిదాయకమైన పర్యవేక్షణలో, వినూత్నమైన కార్యక్రమాలను రూపొందిస్తూ, “విజయవాడ” పట్టణాన్ని మెరుగైన ప్రజాజీవనానికి అనువైన, సౌకర్యవంతమైన మరియు ఆకర్షణీయమైన పట్టణంగా మార్చే దిశలో పయనిస్తున్నారు. విజయవాడ పట్టణాన్ని వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తూ యావత్ భారతదేశానికే తలమానికంగా మార్చే విధంగా కృషి చేస్తున్నారు. కేశినేని నాని గారు నిష్పాక్షికమైన అభిప్రాయాలతో మరియు సహేతుకమైన ఆలోచనాదోరణితో పనిచేసే నవీనతరం నాయకుడు. మెరుగైన ఫలితాలను పొందేదిశలో, సాంప్రదాయబద్దమైన ఆలోచనల్ని అధునాతన సాంకేతిక విజ్ఞానంతో మేళవించి కార్యక్రమాలను అమలు చేసేలా అధికారులకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి వినూత్న శైలిలో పనిచేసే కేశినేని నాని గారిని “ఆధునిక సామాజిక సంస్కర్త”గా గుర్తించడం చాల సముచితం.

kesineni_nani
పూర్తి వివరాల కోసం...

సంప్రదించండి

  కేశినేని భవన్, పిన్నలవారి వీధి, విజయవాడ పిన్ కోడ్: 520002, ఆంధ్రప్రదేశ్ .